చిత్తూరు: శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు అవగాహన

602చూసినవారు
చిత్తూరు: శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు అవగాహన
జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు, మంగళవారం చిత్తూరులోని ఆర్కే జూనియర్ కళాశాలలో శక్తి టీం, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో విద్యార్థినులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ, చిన్న వయసులోనే మంచి చెడు తెలుసుకోవాలని, 18 ఏళ్లు నిండకుండా బాలికల వివాహాలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు. బాల్య వివాహం ఒక పెద్ద సమస్య అని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్