చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర తెలిపిన వివరాల ప్రకారం, మిట్టూరుకు చెందిన జగన్నాథరెడ్డి అనే టీచర్ ఆన్లైన్ మోసానికి గురయ్యారు. గత ఏడాది జూలైలో యూట్యూబ్ లింక్ ద్వారా ఆన్లైన్ పెట్టుబడులపై లాభాలు వస్తాయని నమ్మించి, మొదట రూ.10 వేలు పెట్టుబడి పెట్టి రూ.15 వేలు లాభం పొందారు. ఆ తర్వాత దశలవారీగా రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోవడంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.