జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ సమావేశంలో, డీపీఆర్ కార్యాలయం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు డీపీఆర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.