చిత్తూరు: పింఛను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల

1162చూసినవారు
చిత్తూరు: పింఛను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గురజాల
ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీని అందించడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరు నగర పాలక పరిధిలోని 40వ వార్డు తోటపాళ్యంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛను పంపిణీ చేశారు. వృద్ధులు, మంచానికే పరిమితమైన వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్