యూనివర్సిటీలో ఫీజుల అక్రమాలను ప్రశ్నించిన ఎస్ఎఫ్ఎ నేతలను కిడ్నాప్ చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు డిమాండ్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఏఎస్ఎఫ్ ఐ, ఎస్ఎఫ్ఎ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అక్రమంగా వసూలు చేసిన ఫీజులను విద్యార్థులకు చెల్లించాలని వారు కోరారు.