చిత్తూరు జిల్లాలో ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, ఐదేళ్లలోపు ఉన్న 1,65,203 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.