గత వైకాపా పాలకులు తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తి నెయ్యిని ఉపయోగించి మహా పాపం చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆరోపించారు. వైకాపా నాయకులు తమ తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, గురువారం మురుకంబట్టులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మేయర్ ఎస్ ఆముద తదితరులు పాల్గొన్నారు.