చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం, జూన్ నెలలో రిటైర్డ్ అయిన 9 మంది పోలీస్ సిబ్బందిని నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఘనంగా సన్మానించారు. పోలీసు బాధ్యతలు ఒత్తిళ్లతో కూడుకున్నవని, అయినా వారు ప్రశంసనీయమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. వారి శేష జీవితం సుఖసంతోషాలతో గడవాలని, వారి కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.