ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం, భార్యా పిల్లలతో సంతోషంగా ఉన్న హర్షవర్ధన్, డబ్బు సంపాదించాలనే ఆశతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు. అయితే, ఈ క్రమంలో రూ.36 లక్షలు నష్టపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, 'తాను భర్తగా, తండ్రిగా విఫలమయ్యాను. పాపని బాగా చూసుకో' అని భార్యకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.