చిత్తూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం భాస్కర్ అనే వ్యక్తి కత్తితో మహిళలపై దాడి చేశాడు. యాదమరి మండలం, అరిమకుల పల్లెకు చెందిన భాస్కర నాయుడుకు సరస్వతి కుటుంబంతో భూతగాధ ఉంది. ఆ భూమిలో ఉన్న విద్యుత్ సర్వీస్ తొలగించాలంటూ భాస్కర్ నాయుడు ఫిర్యాదు చేయడానికి రాగా, అక్కడే ఉన్న మహిళలు అడ్డు చెప్పడంతో ఈ గొడవ ప్రారంభమైంది.