ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ,
వైసీపీ పార్టీ చిత్తూరు ఇంచార్జ్ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. అనంతరం చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. పత్రికా అధినేతగా ఉంటూ మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.