కేటిపల్లి జడ్పీ హైస్కూల్‌లో మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్ హామీ

1చూసినవారు
కేటిపల్లి జడ్పీ హైస్కూల్‌లో మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్ హామీ
గుడిపాల మండలం కేటిపల్లి జడ్పీ హైస్కూల్‌లో అన్ని మౌలిక వసతులను త్వరలో కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. ల్యాబ్, కంప్యూటర్లు తదితర అవసరాల కోసం ప్రతిపాదనలు సమర్పిస్తే తన సొంత నిధులతో మంజూరు చేస్తానని తెలిపారు. పాఠశాలలో జరుగుతున్న ఎస్ఎంసీ ఎన్నికలను, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని కూడా పరిశీలించారు.