ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: అభివృద్ధికి హామీ

0చూసినవారు
ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: అభివృద్ధికి హామీ
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఎస్.ఎన్. పురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు, ల్యాబ్, ఫార్మసీ, సంజీవని సేవలను పరిశీలించారు. ఆసుపత్రి అభివృద్ధికి అదనపు భవనం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని వైద్యాధికారి డాక్టర్ జి. దయాసాగర్ కోరగా, అవసరమైన ప్రతిపాదనలను త్వరగా మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ అనిల్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్