చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్, ప్రస్తుత ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026) కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గాలు మరియు పులిచర్ల, రొంపిచర్ల మండలాల బూత్ లెవల్ అధికారులకు ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ పద్ధతులను వివరించారు. కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు. 2025 ఓటర్ల జాబితాలను 2002 జాబితాతో మ్యాపింగ్ చేయాలని, వలస వచ్చినవారు, తాత్కాలిక నివాసంలో ఉన్న వారి వివరాలను స్వస్థల ఓటర్ల జాబితా ఆధారంగా చూడాలని సూచించారు.