కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ, ఎమ్మెల్యే

559చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ, ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. గుడిపాల మండలం చీలాపల్లి గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం రూ. 7 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ బాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్