చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అర్హులైన లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం మరియు కూటమి పార్టీల నాయకులు హాజరయ్యారు.