బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విద్యే మార్గం: న్యాయాధికారి

532చూసినవారు
12/6/26 చిత్తూరులో ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా లేబర్, చైల్డ్ వెల్ఫేర్, డిఎల్ఎస్ఎ శాఖలు సంయుక్తంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించాయి. జిల్లా న్యాయ సేవాధికారి సెక్రటరీ ఎంఎస్ భారతి మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి ప్రతి చిన్నారికి విద్యను అందించాలని, బాల కార్మికత్వానికి రెడ్ కార్డ్ చూపాలని, మంచి బాల్యాన్ని అందించాలని, పిల్లల చేతుల్లో పనిముట్లు కాకుండా పుస్తకాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్