చిత్తూరు: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురికి చిత్తూరు కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 40 వేల జరిమానా విధించింది. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. నరసింహరాజు వాహనదారులకు సూచించారు.