చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీసులు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 3.50 లక్షల విలువైన నాలుగు దొంగిలించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. నేరాలకు ఉపయోగించిన మరో పల్సర్ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.