అన్నమయ్య జిల్లా సదుం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మత్తుకు బానిసలైన ఇద్దరు హర్యానా వ్యక్తులు, విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సదుం గాంధీ రోడ్డులోని దస్తగిరి ఇంట్లో అద్దెకు ఉంటున్న హితేశ్వర్, రామేశ్వర్ అనే ఈ వ్యక్తులు డ్రగ్స్ వినియోగిస్తూ, అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.