స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత పోలింగ్ లక్ష్యంగా చిత్తూరు పట్టణంలో ఎస్పీ తుషార్ డూడి IPS ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సుమారు 1000 మంది పోలీసు సిబ్బంది, STF బలగాలు, వజ్రా వాహనంతో 3 కిలోమీటర్ల మేర కవాతు చేపట్టారు. ఎన్నికల్లో అల్లర్లు, హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.