యాదమరి (మండలం) గాండ్ల కొత్తూరు గ్రామ సమీపంలో బెంగళూరు–చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వి.శరవణ (48) మృతి చెందారు. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు రోడ్డు దాటుతున్న శరవణను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.