మదనపల్లె హార్టికల్చర్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

2చూసినవారు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వచ్చే నెల 2న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న హార్టికల్చర్ కార్యక్రమం ఏర్పాట్లను పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి బుధవారం పరిశీలించారు. కలెక్టరేట్‌లో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బసినికొండలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను, చంద్ర కాలనీలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్