నూనె అంగడిలో చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

4చూసినవారు
నూనె అంగడిలో చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్
చిత్తూరు పట్టణంలోని బజార్ వీధిలో రమేష్ నూనె అంగడిలో జరిగిన చోరీ కేసును చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో జీ. హేమంత్ (21) అనే నిందితుడిని అక్టోబర్ 1న అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ తుషార్ డూడి పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్