చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పల్లెనిద్ర నిర్వహించిన పోలీసులు

998చూసినవారు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పల్లెనిద్ర నిర్వహించిన పోలీసులు
చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలపై నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్