చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు చిత్తూరులోని పాత డీపీఓ కార్యాలయంలో "పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్" కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.