అక్రమ సంబంధం వివాదం.. యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు

6చూసినవారు
అక్రమ సంబంధం వివాదం.. యువకుడి హత్య కేసు ఛేదించిన పోలీసులు
చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీసులు, 19 ఏళ్ల వెంకటేశులు హత్య కేసును కేవలం రెండు రోజుల్లోనే ఛేదించి, నిందితుడు శంకర్ వడివేలును అరెస్టు చేశారు. పాలంతోపు ST కాలనీకి చెందిన వెంకటేశులు హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు. మామిడి తోటలో కాపలాదారుగా పనిచేస్తున్న శంకర్, తన భార్యతో మృతుడికి ఉన్న సంబంధంపై ఆగ్రహంతో 28 జూన్ రాత్రి వెంకటేశులును గొంతు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. జూలై 1న నిందితుడిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్