ప్రిన్సిపాల్ సయ్యద్ మౌలాకు ఘన వీడ్కోలు, కలెక్టర్ సుమిత్ కుమార్ సన్మానం

1294చూసినవారు
ప్రిన్సిపాల్ సయ్యద్ మౌలాకు ఘన వీడ్కోలు, కలెక్టర్ సుమిత్ కుమార్ సన్మానం
30/6/26న చిత్తూరులోని బీఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ మౌలా పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సయ్యద్ మౌలాను శాలువాతో సత్కరించి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. పలమనేరుకు చెందిన సయ్యద్ మౌలా గతంలో పలమనేరు టీకేసి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలోనూ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని ఆయనకు వీడ్కోలు పలికి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you