చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (DTC) మైదానంలో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్ శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మార్చ్‌పాస్ట్‌ను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. శనివారం జరిగే తుది పరేడ్‌కు రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు మహబూబ్ బాష, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.