స్మశాన వాటికల్లో సౌకర్యాల కల్పనకు ఎమ్మెల్యేకు వినతి

1199చూసినవారు
స్మశాన వాటికల్లో సౌకర్యాల కల్పనకు ఎమ్మెల్యేకు వినతి
పలమనేరు మున్సిపల్ పరిధిలోని పాటపేట ఒడ్డివాని కుంట, మదనపల్లి రోడ్డులో ఉన్న స్మశాన వాటికలలో ప్రహరీ గోడ, బోర్‌వెల్, నీటి ట్యాంకు, మరుగుదొడ్లు, నిత్యకర్మలు నిర్వహించేందుకు షెల్టర్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు, వీరశైవ లింగాయత్ సంఘ నాయకులు శనివారం పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అంత్యక్రియలు, నిత్యకర్మలు నిర్వహించే సమయంలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్