గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. DRDA ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, SHG రుణాలు, ఉన్నతి కార్యక్రమం, జీవనోపాధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. పేద కుటుంబాల ఆదాయం పెంచేలా స్థిరమైన జీవనోపాధులు, ఆదాయం వచ్చే ఆస్తులు కల్పించాలని సూచించారు. SHG నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని, ఆస్తులపై మండలాల వారీగా పరిశీలించి 10–15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో DRDA పీడీ శ్రీదేవి, ఎల్‌డీఎం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.