పుంగనూరు ఆసుపత్రిలో మందుల కొరత: ప్రజల ఆవేదన

575చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన రవికుమార్ శుక్రవారం మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా ఆసుపత్రికి వస్తున్నా వైద్యులు సూచించిన మందులు అందుబాటులో లేవని తెలిపారు. గతంలో ఆసుపత్రిలోనే ఇచ్చే మందులను ఇప్పుడు బయట కొనుగోలు చేయాలని సిబ్బంది చెబుతున్నారని ఆయన ఆరోపించారు. దీంతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్