రూ.90 లక్షల చోరీ సొత్తు స్వాధీనం

0చూసినవారు
రూ.90 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
చిత్తూరు జిల్లా కల్లూరు పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ. 90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణ జ్యువెలరీస్‌తో పాటు మొత్తం నాలుగు వరుస చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు ఆర్. దినేష్‌పై 18 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS పోలీసు సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్