చిత్తూరు జిల్లాలో నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమైందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ఐరాల, తవణంపల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించి, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయం, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.