రెవిన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు..ఎమ్మెల్యే

351చూసినవారు
రెవిన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు..ఎమ్మెల్యే
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వి.కోట మండల తహసీల్దార్ సూరప్రకాశ్ నాయక్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చోటు చేసుకోకుండా చూడాలని సూచించారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్లు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాల జారీ వంటి అంశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్