చిత్తూరు నగరంలోని ఎస్టేట్ వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య శనివారం తెలిపారు. మణికంఠ, శేఖర్, మురుగేషన్ పేకాట ఆడుతుండగా అరెస్టు చేసి రూ. 6, 100, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని తహశీల్దార్ ముందు హాజరుపరచి ఒక్కొక్కరికి రూ. లక్ష పూచికత్తుతో బైండోవర్ చేశామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు ప్రజలు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.