చిత్తూరు రైల్వే ప్లాట్‌ఫామ్-1 సమీపంలో ఆదివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. తిరుపతి వైపు వెళ్తున్న రైలు (నం.16854) కింద పడి సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, అయితే ఆమె చేతిపై ‘మురళీ’ అనే పచ్చ బొట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.