కుప్పంలో దామోదర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ జీవిత అనే మహిళ అతని ఇంటి ఎదుట మంగళవారం ఆందోళనకు దిగింది. ఈ సంఘటనతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దామోదర్ కత్తితో బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కుప్పం ప్యాలెస్ ఏరియాలో జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.