రేపటి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, పలమనేరులోని సాయిరాం మల్టీస్పెషల్టి హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ డేగల ప్రభాకర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మమత రాణి, మరియు పలమనేరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ పాల్గొంటారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఈ కార్యక్రమం జరగనుంది.