ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: అవగాహన ర్యాలీతో ప్రజలకు సూచనలు

288చూసినవారు
చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో, ఇన్చార్జి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, వాతావరణ కాలుష్యం, కలుషిత ఆహారం, నీరు, చెడు వ్యసనాలు, మానసిక ఒత్తిడి వంటివి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నాయని తెలిపారు. వీటిని వీడితే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని సూచించారు.

సంబంధిత పోస్ట్