తిరుమల లడ్డు పవిత్రమైనదని, దాని తయారీలో పరిశుభ్రమైన నెయ్యి వాడాలని ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ తెలిపారు. గురువారం కార్వేటినగరం మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని శుభ్రం చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, వైసిపి ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు.