జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, బీసీ కాలనీ వద్ద పాఠశాల బస్సును కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఆయన గాయపడిన విద్యార్థులను పరామర్శించి, అపోలో యూనిట్ హెడ్ బాలరాజ్, ఇతర వైద్యులతో మాట్లాడారు. తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులను వేలూరు సిఎంసికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.