జీడి నెల్లూరు: వారి కపట ప్రేమను నమ్మొద్దు: ఎమ్మెల్యే

771చూసినవారు
ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్, సోమవారం సాయంత్రం జీడీనెల్లూరులో మాట్లాడుతూ, వైసీపీ కపట ప్రేమను రైతులు నమ్మి మోసపోవద్దని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని అన్నారు. మామిడి రైతులకు మేలు చేయాలన్న సీఎం చంద్రబాబు రూ. 6 సబ్సిడీని అందజేస్తే, వైసీపీ దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రైతులను మోసగిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్