గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం డీఎం పురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మామిడి చెట్ల కింద ఆడుకుంటున్న 20 మంది విద్యార్థులను ఒక వింత పురుగు కుట్టింది. దీంతో విద్యార్థులంతా తీవ్ర దురదలకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వింత పురుగు ఏంటనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు.