చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలంలోని రాచపాలెం గ్రామంలోని శ్రీ బాల గురునాధేశ్వర ఆలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా రుద్ర బలగా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 151 రుత్వికులతో మహా పూజ కార్యక్రమం జరిగింది. ఈ పూజలో బెంగళూరు నుంచి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయింది.