పాలసముద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

1235చూసినవారు
పాలసముద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం డ్రోన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ టెక్నాలజీతో ప్రాంతాలను పర్యవేక్షించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం, సమాజ భద్రతను బలోపేతం చేయడం వంటి అంశాలపై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్