గుడిపాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంఆర్‌ఐగా రవిచంద్రన్‌ బాధ్యతలు స్వీకరణ

3478చూసినవారు
గుడిపాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఎంఆర్‌ఐగా రవిచంద్రన్‌ బాధ్యతలు స్వీకరణ
చిత్తూరు జిల్లా గుడిపాల తహసీల్దార్‌ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా జె. రవిచంద్రన్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా చిత్తూరు కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రవిచంద్రన్‌ను ఎంఆర్‌ఐగా డిప్యూటేషన్‌పై నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలో రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని రవిచంద్రన్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్