వెదురుకుప్పం మండలం నుంచి ముగ్గురు
విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. స్థానిక జడ్పీ హైస్కూల్ నుంచి కానాల తేజశ్రీ, సుదర్శన్, శ్రావ్య ఈ ఘనత సాధించారు. ఈ విషయాన్ని హెచ్ఎం శివశంకరయ్య శనివారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు అభినందించగా, తోటి
విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.