గూడూరులో కార్డెన్ సెర్చ్.. 6 బైకులు సీజ్

560చూసినవారు
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గూడూరు సొసైటీ ప్రాంతంలో సీఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 150 ఇళ్లలో పరిశీలించి, సరైన పత్రాలు లేని 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ శేఖర్ బాబు స్థానికులతో మాట్లాడుతూ, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్, రెండో పట్టణ, రూరల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్