గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గా కె. నరసింహమూర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తిలో డిఎస్పిగా పనిచేస్తున్న ఆయనను బదిలీపై గూడూరుకు నియమించారు. ఈ నేపద్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేయడం జరుగుతుందని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.